29.5 C
Hyderabad

పేకాట రాయుళ్ల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న వారిని బుధవారం అరెస్ట్ చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్ పెక్టర్ అంజయ్య తెలిపారు. వర్ని మండలంలోని పొట్టి  గుట్ట తాండ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, వర్నిఎస్ఐ ఆధ్వర్యంలో దాడి చేసి పది  మంది ని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి రూ.58,310 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి చర్య నిమిత్తం వారిని వర్ని ఎస్ఎచ్ఓకు అప్పగించినట్లు పేర్కొన్నారు.

More articles

Latest article