30.9 C
Hyderabad
Monday, August 3, 2026

క్షేత్ర పర్యటనలో ఏర్గట్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: పీఎం ఎస్ హెచ్ ఆర్ ఐ పథకంలో భాగంగా పోచంపాడు లోని టీఎస్ ఆర్ జె సి బాలికల పాఠశాలను ఏర్గట్ల ఉన్నత పాఠశాల విద్యార్థులు సందర్శించడం జరిగింది. అక్కడి పాఠశాలలోని మౌలిక వసతులను గూర్చి, ఆ పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్ ని అడిగి తెలుసుకోవడం జరిగింది. తరగతి గదులు, నీటి వసతి, గ్రంథాలయం, వంటశాల, సైన్స్ ల్యాబ్, మొదలైనవి ఆ పాఠశాలలో సందర్శించడం జరిగింది. పాఠశాలలో కనీస వసతులు ఏ విధంగా ఉండాలో తెలుసుకోవడం, పాఠశాలకు అవసరమైన ఏర్పాట్లను గూర్చి తెలుసుకోవడం కోసం ఈ క్షేత్ర పర్యటన చేశామని పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు  కృష్ణాచారి తెలిపారు. విద్యార్థులకు ఇలాంటి క్షేత్ర పర్యటన వల్ల జ్ఞానాభివృద్ధి, పెరుగుతుందని,తెలియని విషయాలు ఎన్నో తెలుసుకోవచ్చని తెలిపాడు. విద్యార్థులు ఈ క్షేత్ర పర్యటనలో తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోవడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా గడిపారు.దీనిలో భాగంగానే విద్యార్థులు ఎస్సారెస్పీ ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ఈ పర్యటనలో  పాఠశాల ఉపాధ్యాయులు మునిరుద్దీన్, ప్రసాద్, గంగాధర్, ప్రవీణ్ శర్మ, నరేష్, ఇందిర, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ శ్రీ మతి నాగరాణి  పాల్గొన్నారు.

More articles

Latest article