27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఇంటర్నేషనల్ అవుట్ స్టాండింగ్ రీసర్చ్ అవార్డు విశ్వవిద్యాలయానికే గర్వకారణం

Must read

📰 Generate e-Paper Clip

  •  వైస్ ఛాన్స్లర్  ఆచార్య టి.యాదగిరిరావు

 నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :  తెలంగాణ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగానికి చెందిన సీనియర్ ఆచార్యులు ఎం. అరుణకు బోధన, పరిశోధన విభాగంలో ఇంటర్నేషనల్ అవుట్ స్టాండింగ్ రీసెర్చ్ అవార్డ్  లభించినందుకు  వైస్ ఛాన్స్లర్  ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య యం యాదగిరి అభినందించారు.  వైస్ ఛాన్స్లర్ ఆచార్య.  టి. యాదగిరిరావు మాట్లాడుతూ  ఆచార్య అరుణ హైడ్రోబయాలజీ , ఆల్గల్ బయోటెక్నాలజీ విభాగంలో అద్భుతంగా చేసిన   ఉన్నతమైన పరిశోధనలను గుర్తించి  తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఈనెల 23 న జరిగిన ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాంగ్రెస్ 2025 అవార్డు  కార్యక్రమంలో  ఇంటర్నేషనల్ ఔట్ స్టాండింగ్ రీసర్చ్ అవార్డు లభించటం విశ్వవిద్యాలయానికే గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా తెయు విసి  ఆచార్య యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య యాదగిరి లు ఆచార్య అరుణకు మెమొంటో బహూకరించి  సత్కరించారు.  ఈ కార్యక్రమంలోవృక్షశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఏ.ఏ. హలీంఖాన్, ఆచార్య బి. విద్యావర్ధిని అధ్యాపకులు డాక్టర్ శ్రీనవాస్, డాక్టర్ జలంధర్ లు అభినందనలు తెలిపారు.

 

More articles

Latest article