29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇసుక టిప్పర్లు, జేసీబీలు సీజ్

Must read

📰 Generate e-Paper Clip

. టాస్క్ ఫోర్స్ పోలీసుల మెరుపుదాడి
. పోలీసుల అదుపులో 12 మంది

బోధన్, బతుకమ్మ: ఇసుక మాఫియాపై సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపుదాడి చేశారు. సోమవారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ ఇన్ చార్జి అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన ఇన్ స్పెక్టర్ అంజయ్య, ఎస్ఐపీ గోవింద్, స్పెషల్ పార్టీ సిబ్బంది అక్రమంగా ఇసుక తరలిస్తున్న తొమ్మిది టిప్పర్లను మందర్న గ్రామశివారులో పట్టుకున్నారు.

అలాగే ఇసుక లోడింగ్ చేస్తున్న మూడు జేసీబీలను సీజ్ చేశారు. మొత్తం 12 మంది డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలతోపాటు డ్రైవర్లను బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

More articles

Latest article