నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న నారాయణ స్కూలుపై కఠిన చర్యలు తీసుకోవాలని విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నారాయణ స్కూలు యజమాన్యం పాఠశాలలను నడుపుతుండడంతో వెంటనే ఏబీవీపీ కార్యకర్తలతో కలిసి పాఠశాలలను మూసి వేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా అందరూ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ వేసవికాలంలో ఒంటిపూట బడులు ఉన్నప్పటికీ ఒక నిజాం రాజు పరిపాలన లాగా నారాయణ పాఠశాలలో కొనసాగుతుందన్నారు. విద్యార్థులని ఇబ్బందులకు గురి చేస్తూ అనారోగ్యం పాలు చేస్తూ ఆరోగ్య సమస్యలను తీసుకొస్తున్నటువంటి నారాయణ స్కూల్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తే మాకు పర్మిషన్ ఉందని డీఈఒ పర్మిషన్ ఇచ్చారని సమాధానం ఇస్తున్నారని తెలిపారు. కాబట్టి జిల్లా విద్యా శాఖ అధికారి వెంటనే నారాయణ స్కూల్ నీ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే నారాయణ పాఠశాలతో కుమ్మక్కైన డీఈవో దిష్టిబొమ్మ దహనం చేయడానికి కూడా వెనకాడ బోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సోషల్ మీడియా కన్వీనర్ సునీల్, కంటేశ్వర్ జోనల్ ఇంచార్జ్ దుర్గా దాస్, అభినవ్, తేజ, సుశాంత్, ఇంద్రసేన, వేణు, రంజిత్, రాకేష్, నవీన్, దినేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

