ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం సీనియర్ నాయకుడు ఎలమంచి శ్రీనివాసరావు పై దాడికి యత్నం
వర్ని, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాల మధ్య అధిపత్య పోరులో నాయకులు, కార్యకర్తలు బలైపోతున్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన బీర్కూరు మండలం దామరంచ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇక్బాల్ ను అభివృద్ధి పనులు చేయకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డి కి సంబంధించిన కొంతమంది అనుచరులు అడ్డుపడ్డారు. దీంతో ఇక్బాల్ మానసికంగా కృంగిపోయి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయంమై ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం మీడియా సమావేశం నిర్వహించి పోచారం అనుచరులపై ఆరోపణలు చేశారు. ఈఆరోపణలు తట్టుకోలేక శ్రీనివాస్ రెడ్డి అనుచరులు ఏనుగు రవీందర్ రెడ్డి వర్గంపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదివారం అర్ధరాత్రి ఎమ్మెల్యే అనుచరులు కోటగిరి నుంచి పెద్ద ఎత్తున కత్తులు , కర్రలతో వర్ని వెళ్లి అక్కడ హల్చల్ చేశారు. మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు ఎలమంచి శ్రీనివాసరావు పై దాడికి యత్నించారు. కొంతమంది కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని స్వల్పంగా లాఠీ చార్జి చేసి చెదరగొట్టారు. ఎలమంచి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు వచ్చేసరికి కోటగిరి నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులు పరారయ్యారు. ఆదివారం అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు ని చంపటానికి కోటగిరి నుంచి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు కత్తులతో వచ్చారని ఆరోపించారు.
