నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఆచార్య గంగోత్రి రామానుజ దాసు స్వామి పాల్గొన్నారు. యజ్ఞశాలలో పాంచాహ్నిక హవన కార్యక్రమంలో మొదటి రోజు అగ్ని ప్రతిష్ట ద్వార తోరణం పూజ కుంభ ప్రతిష్ట మాధ్యాహ్నిక పూర్ణాహుతి నిర్వహించారు. గుడధ్వజ ఆరోహణ దేవత ఆహ్వానం జరిపి సంతానార్థులకు గరుడ ప్రసాదం అందించారు. మానసా వాచ కర్మన ఆ దేవదేవుడిని నమ్మితే ఈ కలి కాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని గంగోత్రి స్వామి అన్నారు. ఉత్సవం అంటే లోకం అంత సంతోషించడం. బ్రహ్మోత్సవం అంటే సాక్షాత్తు బ్రహ్మనే లోక కల్యాణం కోసం జరిపించే ఉత్సవం బ్రహ్మోత్సవం అని ఆచార్య గంగోత్రి రామానుజ స్వామివారు అన్నారు. బ్రహ్మోత్సవాల్లో గరుడుని మొదటగా ఆహ్వానించి ప్రార్థించారు. వైనతేయ ఇష్టి కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించి, గరుత్మంతుని అనుగ్రహం కోరకు ఈ రోజు యజ్ఞం నిర్వహిస్తామని అన్నారు. గరుడధ్వజాన్ని ఎగురవేసి సకల దేవతలను ఆహ్వానించడం జరిగుతుందని యజ్ఞాచార్యులు శిఖామణి స్వామి అన్నారు. మన సకల మనోవాంచలను… ఆ దేవదేవునికి చేర్చేది గరుత్మంతుడే. మన సకల అభిలాషలను మనో వేగంతో ఆ దేవ దేవునికి గరుడు చేర్చుతాడు. మాతృ ప్రేమ మనల్ని శక్తివంతులని తయారు చేస్తది. గరుడు మనోవేగం కంటే వేగంగా ప్రయాణం చెయ్యగల్గుతాడు. వజ్రాయుధం కూడా గరుద్మంతుడి శక్తి ముందు దుందుడుపే… అంత వేగం మరియు అంత శక్తి గరుడుకి రావడానికి కారణం అతనికి అతని తల్లి వినత పైన గల్గిన భక్తియే అని ఆచార్య గంగోత్రి రామానుజ స్వామి వారు ప్రవచనం చేశారు. ఉదయం అగ్నిదేవుని ఆహ్వానించి యాగ కార్యక్రమం మొదలు పెట్టారు. ధ్వజారోహణ చేసి గరుడ ప్రసాదం ఆచార్య గంగోత్రి రామానుజ స్వాముల వారి చేతుల మీదుగా “సంతానం లేని దంపతులకు” పంచడం జరిగింది. మధ్యాహ్నం తదియారాధనతో కార్యక్రమాలు ముగిసాయి. ఈ కార్యక్రమంలో ఆచార్య గంగోత్రి రామానుజ స్వామి, ఆలయ ధర్మకర్తలు ప్రముఖ నిర్మాత దిల్ రాజు , నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, నర్సారెడ్డి నరాల సుధాకర్ ప్రసాద్ రాజేశ్వర్ రమేష్ సాయిలు భాస్కర్ మురళి చిన్నయ్య గంగారెడ్డి నరేష్ సురేష్ యజ్ఞాచార్యులు ఆచార్య శిఖామణి స్వామి , శ్రీఖర్ ఆచార్య, స్వామి రోహిత్ కుమారాచార్యులు, విజయ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

