28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మంద కృష్ణ మాదిగ చిత్ర పటానికి క్షీరాభిషేకం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాచారెడ్డి: వర్గీకరణ కోసం చేసిన సుదీర్ఘ పోరాటం తో సుప్రీంకోర్టు తీర్పు కు  లోబడి  ప్రభుత్వం అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతుతో  వర్గీకరణ అమలుకు అసెంబ్లీ లో బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా వర్గీకరణ సాధనకు కృషి చేసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ  చిత్రపటానికి మాచారెడ్డి మండలంలోని గజ్య నాయక్ తండా లో మండల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ  ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు చేసిన పోరాట ఫలితంగా వర్గీకరణ సాధ్యమైందని మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు బట్ట రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చుక్కాపురం నాగరాజు,  సీనియర్ నాయకులు బట్ట ఎల్లయ్య , రత్నగిరిపల్లి,  సోమార్పేట, కొత్తపల్లి, గన్ పూర్  వివిధ గ్రామాల అధ్యక్షులు  నాగరాజు, రమేష్,  దాసు,  నర్సింలు, మహిళ నాయకులు లక్ష్మి, నాయకులు దేవయ్య, లక్ష్మీనర్సు,  బాబు  తదితరు పాల్గొన్నా రు.

More articles

Latest article