31.2 C
Hyderabad

పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: నేటి నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి, వైద్య, పరీక్షా సమయంలో డెస్కులను ఏర్పాటు చేయాలని టీజీవిపి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ ఎంఈఓ రాజా గంగారెడ్డికి గురువారం వినతి పత్రం అందజేశారు. విద్యార్థులు అసౌకర్యాలకు గురికాకుండా, మాస్ కాపీయింగ్ పాల్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ సమీర్ ఖాన్, యోగేష్, సాత్విక్, తదితరులు ఉన్నారు.

More articles

Latest article