28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంటుంది

Must read

📰 Generate e-Paper Clip

  • మాదిగ  జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ  బిల్లుకు చట్ట బద్దత కల్పించి మాదిగ, మాదిగ ఉపకులాలకు న్యాయం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి రుణపడి ఉంటుందని మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ అన్నారు. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును అసెంబ్లీలో స్వాగతిస్తూ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారని తెలిపారు. అందుకు తగ్గట్టుగానే వారం రోజుల్లో ఎస్సీ వర్గీకరణపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి జస్టీస్ షమీం అక్తర్ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్పీ వర్గీకరణ చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ  గౌరవ అధ్యక్షులు రాజ్ గగన్  మాదిగ, అధికార ప్రతినిధి మల్లాని శివ మాదిగ, లింగం మాదిగ, గంగాధర్ గాయక్వాడ్ మాదిగ, సాయి మాదిగ, శంకర్ మాదిగ, కేశవ్ మాదిగ, గణేష్ మాదిగ, హరీష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Our nation is indebted to CM Revanth Reddy.

More articles

Latest article