27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆలయాల హుండీల లెక్కింపు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని నర్సి రోడ్డు లో గల మారుతి మందిరం, ప్రసిద్ధ శైవ శ్రీ ఏక చక్రేశ్వరాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశాల మేరకు శాఖ పర్యవేక్షకురాలు కమల కార్య నిర్వహణ అధికారి రాములు ఆధ్వర్యంలో మంగళవారం హుండీలను తెరిచి లెక్కించడం జరిగింది. మారుతి మందిరంలో 7 నెలలకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా 30వేల, 6వందల, 60 రూపాయలు వచ్చినట్టు, మహాశివరాత్రి పురస్కరించుకొని ఏక చక్రేశ్వర శివాలయంలో 3లక్షల, 02వేల, 9వందల, 90 రూపాయలు భక్తుల కానుకల ద్వారా నగదు వచ్చాయని ఇట్టి కానుకల నగదును ఆ ఆ దేవాలయాల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని శాఖ పర్యవేక్షకురాలు, కార్యనిర్వాహణ అధికారి ఆలయాల చైర్మన్లు గుండెడి శంకర్, హరికాంత్ చారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇట్టి నగదునీ ఆలయ అభివృద్ధికి దేవాదాయ శాఖ ఆదేశానుసారం ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయాల ప్రధానార్చకులు గణేష్ మహారాజ్, ప్రవీణ్ మహారాజ్, అర్చకులు మహేష్ పాఠక్, శివ,  వాసవి క్లబ్ బోధన్, శ్రీ వైష్ణవి సంస్థ నిజామాబాద్ సభ్యులు భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Counting of temple hundis

More articles

Latest article