28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

డీకే అరుణ ఇంట్లో చొరబడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :   బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి చొరబడిన వ్యక్తిని హైదరాబాద్ లోని పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని డిల్లీకి చెందిన అక్రమ్ గా గుర్తించారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఎంపీ ఇంట్లోకి  చొరబడేందుకు గల కారణాలను తెలుసుకుంటున్నారు. ఈనెల 16న జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 56లో ఎంపీ అరుణ నివాసంలోకి నిందితుడు ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈఅంశంపై ఎంపీ అరుణకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు.

More articles

Latest article