కామారెడ్డి, బతుకమ్మ : తమ సొంత భూమిని కబ్జా చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని బాధితుడు గంగని చిన్న నర్సింలు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం భవానిపేట గ్రామానికి చెందిన బాధితుడు గంగని చిన్న నర్సింలు, భార్య గంగని చిన్న బావ మీసాల నర్సింలు మాట్లాడుతూ తన తల్లి పేరు మీద భవానిపేట గ్రామ శివారులో 841 సర్వే నంబరులో 2 ఎకరాల 37 గుంటల భూమి ఉందన్నారు. అయితే ఈ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులు వెంచర్ కోసం తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. భూమి కబ్జా విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జా చేసే వ్యక్తులకు మాజీ సర్పంచ్ అండగా నిలుస్తున్నారని, తమపై దౌర్జన్యానికి పాల్పడుతూ కొట్టడానికి వచ్చారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని, లేకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి నాకు న్యాయం చేయగలరని వేడుకున్నారు.

