. . .హొన్నాజీపేట్ లో దారుణం
ధర్పల్లి, బతుకమ్మ:
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ లో దారుణం జరిగింది. గ్రామానికి చెందినపాలెం నడిపి మల్లయ్య ( 55) అనే వ్యక్తిని భార్య,కొడుకు కలిసి చంపేశారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. పశువుల ( ఆలమందల) కాపరిగా పనిచేసే మల్లయ్య తలపై కొడుకు మధు బీరు సీసాతో దాడి చేసి , గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిసింది. అందుకు మల్లయ్య భార్య లక్ష్మి సహకరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాధ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆస్తి తగదాలు, డబ్బుల విషయంలో మల్లయ్య హత్య జరిగినట్లు సమాచారం.
