27.2 C
Hyderabad

పిడి గుద్దులాట నిర్వహించొద్దు

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ: తెలంగాణ లోనే ప్రత్యేకంగా ప్రతి ఏడాది హోలీ సందర్భంగా హున్సాలో నిర్వహించే పిడిగుద్దులాటకు పోలీసులు బ్రేక్ వేశారు. హోలీ వేడుకల్లో భాగంగా హున్సాలో పిడిగుద్దులాట నిర్వహించొద్దని నోటీసులు జారీ చేశారు. పిడిగుద్దులాటకు నిర్దిష్టమైన అనుమతంటూ లేదని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలను ఉల్లంఘించొద్దని, ఐదుగురి కన్నా ఎక్కువ మంది గుడిగూడొద్దని ఆదేశించారు. దీంతో హున్సాలో పిడిగుద్దులాట నిర్వహణపై సందిగ్దత నెలకొంది.

More articles

Latest article