29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని పూలాంగ్ చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. నందిపేట్ మండలం తల్కెద గ్రామానికి చెందిన జిడ్డం హన్మండ్లు(54) ఆయుర్వేద వైద్యునిగా పనిచేస్తున్నాడు. గోల్ హనుమాన్ వద్ద వాసని ఆయూర్వేద ఆయుర్వేద ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు.  బుధవారం హనుమండ్లు, అతని  వద్ద పనిచేసే శ్రీహరి పని నిమిత్తం వినాయక్ నగర్ వెళ్లి తిరిగి వస్తుండగా పూలాంగ్ చౌరస్తా వర్ద టిప్పరు ఢీకొంది. ఈ ఘటనలో హన్మండ్లు దుర్మరణం చెందగా, శ్రీహరికి స్వల్పంగా గాయాలయ్యాయి. శ్రీహరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article