నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ ఎసిపి, సిఐతో పాటు ట్రాఫిక్ సమస్యలతో ప్రాంతాలను బుధవారం నుడా చైర్మన్ కేశవేణు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదాలను నివారించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొత్త ట్రాఫిక్ సిగ్నల్ మౌలిక సదుపాయాలను స్థాపించడానికి అవసరమైన నిధులు నుడా నుండి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
