27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మూల్యాంకన నిధులు విడుదల చేయాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: గతేడాది ఎస్సెస్సీ మూల్యాంకన విధుల్లో పాల్గొన్న వారందరికీ విడుదలైన నిదులు రూ.60లక్షలు సరిపోవని, వెంటనే అదనంగా నిధులు కేటాయించాలని టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సుమారు 1,400 మంది ఉపాధ్యాయులు గతేడాది మూల్యాంకనంలో పాల్గొన్నారని, అందుకు సంబంధించి రూ.60లక్షలు విడుదలైనట్లు తెలిపారు. ప్రతి రోజూ ఒక్కో సబ్జెక్టు ఉపాద్యాయుడు 40 నుంచి 50 వరకు పేపర్లు పది రోజులపాటు మూల్యాంకనం చేశారని అన్నారు. ఒక్కో పేపర్ కు రూ.10 చొప్పున, అలాగే ఒక్కో ఉపాధ్యాయుడికి రూ.5వేల చొప్పున టీఏ, డీఏతోపాటు మూల్యాంకనంలో పాల్గొన్న చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్ల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని కోరారు. అలాగే త్వరలో జరగనున్న ఎస్సెస్సీ పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ నిధులు విడుదల చేయాలని పేర్కొన్నారు.

More articles

Latest article