మూల్యాంకన నిధులు విడుదల చేయాలి

నిజామాబాద్, బతుకమ్మ: గతేడాది ఎస్సెస్సీ మూల్యాంకన విధుల్లో పాల్గొన్న వారందరికీ విడుదలైన నిదులు రూ.60లక్షలు సరిపోవని, వెంటనే అదనంగా నిధులు కేటాయించాలని టీపీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ డిమాండ్ చేశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో సుమారు 1,400 మంది ఉపాధ్యాయులు గతేడాది మూల్యాంకనంలో పాల్గొన్నారని, అందుకు సంబంధించి రూ.60లక్షలు విడుదలైనట్లు తెలిపారు. ప్రతి రోజూ ఒక్కో సబ్జెక్టు ఉపాద్యాయుడు 40 నుంచి 50 వరకు పేపర్లు పది రోజులపాటు మూల్యాంకనం చేశారని అన్నారు. ఒక్కో పేపర్ కు రూ.10 చొప్పున, అలాగే ఒక్కో...