విద్యుత్ షాక్ తో  రైతు మృతి

0 1,553

రాజంపేట, బతుకమ్మ :  విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో చోటు చేసుకుంది. రాజంపేట ఎస్సై పుష్ప రాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. తలమడ్ల గ్రామానికి చెందిన పెట్టిగాడి రామచంద్రం (61) మంగళవారం ఉదయం గ్రామ శివారులోని తమ వ్యవసాయ పొలంలో నీరు పారించడానికి బోర్ స్టాటర్ స్టార్ట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. ఎంతసేపైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా ప్రమాదవశాత్తు బోరుమోటారు వద్ద విద్యుత్‌ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. మృతునికి  కూతురికి పెళ్లి కాగ , కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.