28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళలు అన్ని రంగాలలో ఎదగాలి

Must read

📰 Generate e-Paper Clip

  • జిల్లా న్యాయసేవా సంస్థ, కార్యదర్శి,  సీనియర్ సివిల్ జడ్జి పి.పద్మావతి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మహిళలు అన్ని రంగాలలో ఎదగాలని జిల్లా న్యాయసేవా సంస్థ, కార్యదర్శి,  సీనియర్ సివిల్ జడ్జి పి.పద్మావతి అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర  మహిళ సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో  స్థానిక ప్రెస్ క్లబ్ లో సోమవారం  ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత అధ్యక్షతనగా  అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళలు అన్ని రంగాలలో ఎదుగుతున్నారని అన్నారు. అదేవిధంగా ఐద్వా మహిళా సంఘం పోరాటాలే కాకుండా మహిళలను చైతన్య పరచడంలో ముందుంటుందని అభినందించారు. మహిళాలకు ఉన్న సమస్యలను జిల్లా న్యాయ సలహా సంస్థలకు తెలియజేస్తే వారి సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తామని అన్నారు. మహిళలు చదువుల్లోనే కాకుండా పోరాటాలలో ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ బీ, గైనకాలజిస్ట్ డాక్టర్ బండారి సుజాత, ఇంటర్నేషనల్  గోల్డ్ మెడలిస్ట్ స్విమ్మర్ పూర్ణ, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత , స్వర్ణలత రేణుకా,కలా, రేఖ, శ్రీదేవి, విమల, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Women should grow in all fields.

More articles

Latest article