27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి ప్రవేశాలు

Must read

📰 Generate e-Paper Clip

  • అడ్డుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు 

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డికి వెళ్లే దారిలో హనుమాన్ ఆలయం సమీపంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి బస్వాపూర్, సిద్ధ రామేశ్వర నగర్ గ్రామాల చెందిన లబ్ధిదారులు మంగళవారం ఉదయం ప్రవేశాలు చేయగా భిక్కనూరు రెవెన్యూ,పోలీసు శాఖ అధికారులు అడ్డుకున్నారు. గతంలో సైతం ఇలానే జరగా అప్పుడు కూడా అధికారులు సముదాయించి డబుల్ బెడ్ రూమ్ లకు తాళాలు వేశారు. మరలతాళాలను పగలగొట్టి పాలు పొంగించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకొని మీరు అక్రమంగా తాళాలు పగల కొట్టి వెళ్లడం సరికాదని, కలెక్టర్ ఆదేశాలు వచ్చేంతవరకు ఆగాలని రెవెన్యూ అధికారులు పోలీసులు డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు చెప్పడంతో వారు వెనుతిరిగారు.

More articles

Latest article