పోలీసులకు సహాయ సహకారాలు అందించాలి

0 1,111

బతుకమ్మ, (ఏర్గట్ల), మోర్తాడ్:  ఏర్గట్ల మండల కేంద్రంలో మంగళవారం గణేష్ ఉత్సవాల శాంతి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ బి. రాము మాట్లాడుతూ పండుగలను కలిసి మెలిసి కుల మతాలకతీతంగా ప్రశాంతంగా భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని కోరారు. వచ్చే పండుగలను పురస్కరించుకొని పండుగలను జరుపుకునే ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు కారుపాకల నర్సయ్య, క్యాషియర్ సోమ లింగారెడ్డి, ఉపాధ్యక్షులు చేవూరి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.