26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలి

Must read

📰 Generate e-Paper Clip

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ముగిసిన అఖిల పక్ష సమావేశం

వెబ్ న్యూస్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వం లో నిర్వహించిన అఖిల పక్ష సమావేశం ముగిసింది. కేంద్రం దగ్గర  అపరిష్కత అంశాలపై  చర్చలు జరిపారు. పెండింగ్ సమస్యల సాధన అజెండాగా సమావేశం సాగింది. నిధులను పార్లమెంట్ లో ఎలా పోరాడాలో చర్చించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అఖిలపక్ష ఎంపీల సమావేశంలో 28 అంశాలపై చర్చ జరిగింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హామీలపై చర్చ కొనసాగింది.. రాష్ట్రానికి రావాల్సిన అంశాలను కేంద్రం నెరవేర్చాలని కోరుతూ ప్రతిపాదనలు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ అంశాలపై చర్చలు జరిపారు. సమావేశానికి రావాలని బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలను ప్రత్యేకంగా ఆహ్వానించినా రాలేదని భట్టి  తెలిపారు.

More articles

Latest article