బిచ్కుంద, బతుకమ్మ : బిచ్కుంద పట్టణంలో శనివారం సీఐ జగడం నరేష్ ఆధ్వర్యంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఫ్లాగ్ మార్చ్ పట్టణంలోని బస్టాండ్ మీదుగా బాన్సువాడ రోడ్డు నుంచి కమ్మరి గుడి చౌరస్తా వరకు సాగింది. ఈ సందర్భంగా సీఐ జగడం నరేష్ మాట్లాడుతూ శాంతిభద్రతల సమస్యలు, మతఘర్షణలు జరిగినప్పుడు వెంటనేవచ్చి పోలీసులకు సహాయ సహకారాలు అందించి బందోబస్తు నిర్వహించి అదుపు చేయడం గురించి ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించమన్నారు. ప్రజలకు మేమున్నామనే భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద పోలీస్ సిబ్బంది, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.
