26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా ఎత్తోండ జడ్పిహెచ్ఎస్ లో స్కూల్ డే

Must read

📰 Generate e-Paper Clip

కోటగిరి, బతుకమ్మ : మండలంలోని ఎత్తోండ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం రాత్రి స్కూల్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  వక్తల ఉపన్యాసాలు, విద్యార్థుల ఆటపాటలు అందరిని ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్కూల్ డే సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన ఆటల పోటీలలో ప్రతిభ కనపరించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి పోతంగల్ మండలాల ఎంఈఓ లు శ్రీనివాసరావు, శంకర్, హెచ్ఎం అలివేలు, రాజు దేశాయ్, మాజీ సర్పంచ్ ఆనంద్, గ్రామ యువకులు సూర్యకాంత్, సంగం శ్రీనివాస్,రాజ్ కుమార్, ఆదినారాయణ, గంగుల విఠల్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article