26.2 C
Hyderabad
Monday, August 3, 2026

టోల్ వసూళ్లపై రైతుల ఆగ్రహం

Must read

📰 Generate e-Paper Clip

బిక్కనూర్, బతుకమ్మ :బిక్కనూర్ రామేశ్వర్ పల్లి గ్రామ రైతులు,గ్రామస్తులు   స్థానిక రైతులకు కూడా టోల్ మినహాయింపు ఇవ్వకపోవడం పై మంగళవారం ఉదయం ఆందోళనకు దిగారు.పండించిన కూరగాయలు అమ్ముకునేందుకు వచ్చినా రైతులకు కూడా టోల్ వసులు చేయడం పై రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాసేపు రైతులు మిగతా వాహనాలకు కూడా టోల్ వాసులు చేయకుండా గేట్లు ఓపెన్ గా వదిలేశారు.దాదాపు అరగంట కు పైగా వాహనాలు టోల్ లేకుండా వెళ్లడంతో కాస్త ఉద్రిక్తత చోటు చేసుకుంది.కొత్త కాంట్రాక్టర్ వచ్చాక రైతులకు టోల్ వాసులు చేస్తున్నారని మండిపడ్డారు.టోల్ ప్లాజా మేనేజర్ వచ్చి రైతులతో మాట్లాడి,సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

More articles

Latest article