27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

బోర్గాం(పి) ప్రభుత్వ పాఠశాల భూమిని కాపాడండి

Must read

📰 Generate e-Paper Clip

  • ప్రజావాణిలో కలెక్టర్ కు, రూరల్ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన పాఠశాల పూర్వ విద్యార్థులు 

 

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని  బోర్గం (పాంగ్రా ) జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన భూమిని కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు కబ్జాకు పాల్పడుతున్నారని పూర్వ విద్యార్థులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీప దూరంలో గల బోర్గం (పాంగ్రా) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన సర్వే నంబర్ 586/1/2లో ఒక ఎకరం 21గుంటల భూమి ని విద్యార్థుల ఆటస్థలం కోసం కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిపై పాఠశాల పూర్వ విద్యార్థులు  సోమవారం రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డితో పాటు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రెవెన్యూ డివిజనల్ అధికారిని విచారణ చేపట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు.

More articles

Latest article