బోర్గాం(పి) ప్రభుత్వ పాఠశాల భూమిని కాపాడండి

ప్రజావాణిలో కలెక్టర్ కు, రూరల్ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన పాఠశాల పూర్వ విద్యార్థులు    నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగర శివారులోని  బోర్గం (పాంగ్రా ) జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన భూమిని కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు కబ్జాకు పాల్పడుతున్నారని పూర్వ విద్యార్థులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీప దూరంలో గల బోర్గం (పాంగ్రా) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించిన సర్వే నంబర్ 586/1/2లో ఒక ఎకరం 21గుంటల భూమి...