బతుకమ్మ మోర్తాడ్ : పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం గతంలో ఉపాధి హామీని ప్రారంభించారు. పనికి ఆహార పథకం ద్వారా పేద ప్రజలకు పని కల్పించి ఆహారం అందించాలని ఉద్దేశంతో ఏర్పరిచారు. కానీ క్షేత్రస్థాయిలో భిన్నంగా జరుగుతుందని తెలుపడంలో సందేహం లేదు. గ్రామాల్లో కూలీల సంఖ్య పెంచాలని కనీసం 50 మంది పెంచాలని వారం రోజులుగా అధికారులు క్షేత్ర సహాయకులకు చెప్పిన కూలీల సంఖ్య పెంచకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న క్షేత్ర సహాయకులకు సోమవారం రోజు జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న 101 మంది క్షేత్ర సహాయకులకు నోటీసులు అందించినట్లు అధికార యంత్రంగా పేర్కొంది. ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించాలని కూలీల సంఖ్య పెంచాలని, ప్రతి గ్రామములో కనీసం 50 మంది కూలీలకు పనులు కల్పించాలని డైరెక్టర్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యాలయం నుండి పలుమార్లు ఆదేశాలు ఇచ్చినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో 101 మంది క్షేత్ర సహాయకులు తమ గ్రామంలో కనీసం 50 మంది కూలీలకు కూడ పనులు కల్పించడం లేదని కూలీల సంఖ్య పెంచడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించుచున్నారని, పై అధికారుల ఆదేశాలు పాటించడం లేదని గమనించబడినది కావున పైన తెలిపిన అభియోగములపై క్షేత్ర సహాయకులు కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని. అందరికీ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసు అందిన క్షేత్ర సహాయకులు రెండు రోజుల్లోగా లిఖితపూర్వకంగా సంజాయిషీ సమర్పించవలసినదిగా ఆదేశించడం జరిగిందని సమాచారం. ఉద్యోగుల సేవ నిబంధన ప్రకారం తదుపరి చర్యలు తీసుకొనబడునని నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయంపై బతుకమ్మ గ్రామీణ అధికారి సాయి గౌడ్ ను సంప్రదించగా నోటీసులు అందిన ప్రతి ఒక్కరు రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని తెలియజేశారు.
