- సానుకూలంగా స్పందించిన ఎస్ఈ
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : టీవీఎసీ జేఏసీ తలపెట్టిన చలో విద్యుత్ సౌదా కార్యక్రమానికి హాజరైన విద్యుత్ కార్మికుల వేతనాల నుంచి రూ.13 వేలు కోత విధించడంపై నిజామాబాద్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ రవీంధర్ ను నాయకులు కలిశారు. మార్చి 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజుల పాటు జరిగిన చలో విద్యుత్ సౌదా కార్యక్రమంలో పాల్గొన్న కార్మికుల వేతనంలో కోతలు విధించడం వల్ల వారు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర జాయింట్ సెక్రటరి సింగిరెడ్డి చంద్రారెడ్డి ఎస్ ఈతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని కోరారు. దానిపై సానుకూలంగా స్పందించిన ఎస్ఈ రవీంధర్ ఎన్ వోసీ అప్లయ్ చేయాలని డిఈలతో మాట్లాడి వేతనాలు సవరించి ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కనకరాజు ,కరుణాకర్ , టీవీ ఏసి జెఎసి నిజామాబాద్ జిల్లా కన్వీనర్ బట్టు గంగాధర్, వర్కింగ్ చైర్మన్ నరేష్ ,వైస్ చైర్మన్ తామస్,నిజామాబాద్ డివిజన్ చైర్మన్ రతన్ సింగ్,డిచ్పల్లి డివిజన్ చైర్మన్ రవీందర్,రాజేష్ ,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
