నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : క్రీడోత్సవాల్లో భాగంగా నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులకు, సిబ్బందికి వివిధ క్రీడలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కళాశాల ప్రిన్సిపల్ డా. పి. రామ్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అధ్యాపకులలోని ప్రతిభను గుర్తించదానికి, ఉల్లాసమైన వాతావరణాన్ని కల్పించడం కోసం ఈ క్రీడలు ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ బాలమణి, అకదేమిక్ కో ఆర్డినేటర్ ఐ.గంగాధర్, పరీక్షల నియంత్రణాధికారి భారత్ రాజ్, ఎన్.సి.సి. అధికారి లెఫ్టినెంట్ డా. రామస్వామి, ఐ.క్యూ. ఏ.సి. కో-ఆర్డినేటర్ రాజేష్, సూపరిండెంట్ ఉదయ్ భాస్కర్, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు.
