27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ :  సీఎం పిటిషన్ పై తప్పుడు నివేదిక ఇచ్చిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీ వీ నరసింహారెడ్డి , ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మందుల బాలు మాట్లాడారు. ఆర్మూర్ మున్సిపల్  అక్రమాలపై సీఎంఓ కు ఫిర్యాదు చేశామని తెలిపారు.  సి ఎం ఓ నుండి అడిషనల్ కలెక్టర్ అంకిత్ కు విచారణ చేయాలని ఆదేశాలు వచ్చాయని తెలిపారు.  ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ విచారణ చేయమని చెప్పితే 144 అక్రమ ఇంటి నంబర్ లు రద్దు చేశామని నివేదికలో పొందుపరిచారు కానీ ఇప్పటివరకు ఆ ఇంటి నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కొన్ని వ్యాపార సముదాయాలు కాంప్లెక్స్లు ఇప్పటికీ అవి కిరాయికి ఇచ్చి అక్రమ కబ్జాదారులు దర్జాగా ఉన్నారని ఎలాంటి నోటీసులు కానీ వాటిపై ఎలాంటి చర్యలు కానీ తీసుకోలేదని ఆరోపించారు. కాలం చెల్లిన ఆటో ట్రాలీలను రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ లేకున్నా యథేచ్చగా వాటిని వినియోగించుకుంటున్నారని, అదే సామాన్యుడి వాహనాలు రిజిస్ట్రేషన్ చేయకుండా ఇన్సూరెన్స్ లేకున్నా వాటిపై ఆర్టీవో అధికారులు చలాన్లు విధిస్తారని మండిపడ్డారు. పెర్కిట్  కోటఆర్మూర్ ప్రాంతంలోని ఇరిగేషన్ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు అని ఎన్నోసార్లు భారతీయ జనతా పార్టీ ఫిర్యాదు చేసి ఉద్యమం చేస్తే ఇప్పుడు ఆ షాపింగ్ కాంప్లెక్స్ ని సీస్ చేశామని తప్పుడు నివేదిక పంపించారని తెలిపారు. అక్రమార్కులకు వత్తాస్తు పలుకుతున్న అధికారులు వారి ఇంట్లో ఆఫీసులలో పని చేసుకోండి తప్ప ప్రజలు కడుతున్న పన్నులు పై జీతాలు తీసుకొని పర్సనల్ వ్యక్తులకు పనిచేయడం ఏంటని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా నాయకులు నూతల శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్, మాజీ పట్టణ అధ్యక్షులు ద్యాగ ఉదయ్, మాజీ కౌన్సిలర్ ఆకుల శ్రీను, మాజీ సర్వసమాజ అధ్యక్షులు ఆకుల రాజు, పాన్ శీను, ఆరే రాజేశ్వర్,గుగులోత్ తిరుపతి నాయక్, ఖందిష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article