- భారీగా నగదు అపహరణ
కమ్మర్ పల్లి, బతుకమ్మ: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో భారీ చోరీ జరిగింది. కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని మినుముల గంగాధర్, వంకార్ శ్రీనివాస్ కుటుంబాలు ఇంటికి తాళం వేసి వెళ్లగా ఈ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగుల గొట్టి గంగాధర్ ఇంటిలో రూ.5 లక్షల నగదు, ఆర తులం బంగారం, శ్రీనివాస్ ఇంట్లో రూ.20 వేల నగదు, ఆరతులం బంగారు నగలను చోరీ చేశారు. శనివారం ఉదయం ఈ విషయం వెలుగు లోకి వచ్చింది. కమ్మర్ పల్లి ఎస్సై అనిల్ రెడ్డి చోరీ జరిగిన ఇండ్లను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

