హైదరాబాద్, బతుకమ్మ: వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. తాను చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై నేరం అంగీకరించిన పోసాని.. బెయిల్ కోరుతూ రైల్వే కోడూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే శని, ఆదివారాలు సెలవు కావడంతో ఆయన పిటిషన్ ను న్యాయస్థానం సోమవారం విచారించే అవకాశం ఉంది. పోలీసులు సైతం అదే రోజు పిటీ వారెంట్ వేయనున్నారు.
