30.9 C
Hyderabad
Monday, August 3, 2026

గ్రామపంచాయతీ కార్యాలయం తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలం రాంపూర్(కలన్) గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయం, పల్లె ప్రకృతి వనం వైకుంఠధామం,నర్సరీ,కంపోస్టు షెడ్డు, గ్రామంలోని మంచినీటి మోటార్ ను పిట్లం మండల ఇన్చార్జి ఎంపిఓ,గ్రామ స్పెషల్ ఆఫీసర్ రాము పరిశీలించారు .అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ గ్రామంలోని ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చూడాలని,మిషన్ భగీరథ నీటిని అన్ని ట్యాంకులలో నింపే విధంగా చూడాలని గ్రామ ప్రజలు నీటిని వృధా చేయకుండా అరికట్టాలని గ్రామపంచాయతీ కార్యదర్శి భాస్కర్ కు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి భాస్కర్,గ్రామపంచాయతీ కారోబార్ కృష్ణ,గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Inspection of Gram Panchayat Office

More articles

Latest article