27 C
Hyderabad

కన్నతల్లిని కడతేర్చిన కొడుకు

Must read

📰 Generate e-Paper Clip

. . . సోదరుడి హత్య కేసులో రాజీకి  రాలేదని ఘాతుకం

 పిట్లం, బతుకమ్మ :

ఆస్తి తగాదాల విషయంలో తన సోదరుడిని హత్య చేసిన వ్యక్తి అ కేసులో తన తల్లి రాజీకి రాకపోవడంతో ఆమెను హత్య చేశారు. ఈ సంఘటన బుధవారం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది.పిట్లం మండల కేంద్రానికి చెందిన సాబెరా బేగం ( 60) కు నలుగురు కొడుకులు, ఒక కూతురు సంతానం కలరు. 2021 వ సంవత్సరంలో ఆమె రెండో కొడుకైన షాదుల్, మూడవ కొడుకైన ముజీబ్ ని ఆస్తి తగాదాల విషయంలో గొడవపడి కత్తితో పొడిచి చంపేయగా అట్టి విషయం లో మర్డర్ కేసు అయినది. మర్డర్ కేసు ప్రస్తుతం కోర్టులో ట్రయిల్ నడుస్తుంది దీంతో కేసులో నిందితుడు ఆయన షాదుల్ వాళ్ళ అమ్మను కేసు రాజీ కమ్మని కోరగా దానికి సబెరా బేగం ఒప్పుకోకపోవడం గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 25న ఉదయం షాదుల్ తన తల్లి సాబెర బేగం తలపై రోకలి  దుడ్డుతో కొట్టగా ఆమె తలకు బలమైన గాయమై చికిత్స పొందుతూ నిజామాబాద్ లోని  ప్రైవేట్ హాస్పిటల్ లో మరణించినట్టు ఎస్ఐ రాజు తెలిపారు. మృతురాలి పెద్దకొడుకైన అబ్దుల్ ఖాదర్ ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. షాదుల్ పరారీలో ఉన్నట్లు తెలిసింది.

More articles

Latest article