25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

Must read

📰 Generate e-Paper Clip

పీడీఎస్ యూ నాయకుల డిమాండ్

నిజామాబాద్, బతుకమ్మ : నిబంధనలు విరుద్ధంగా అడ్మిషన్లు చేస్తూ అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రైవేటు,కార్పొరేట్ పాఠశాలలకు చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నగరంలోని గూపన్పల్లి శ్రీ చైతన్య పాఠశాల ఎదుట నిరసన, అడ్మిషన్ కరపత్రాల దహనం చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి ఆశోక్ కుమార్కు  వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. నరేందర్, కర్క గణేష్ లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యా పూర్తిగా వ్యాపారమయమైందని విమర్శించారు. ఒకే పాఠశాల పేరుతో సబ్ క్యాంపస్ లపేరుతో కనీస వసతులు లేకుండానే పాఠశాలలను ప్రారంభిస్తున్నారన్నారు. ఉపాధ్యాయ అర్హతలు లేకుండానే టీచర్లుగా నియమించుకుంటున్నారన్నారు. విద్యార్థులను విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాల పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తూ, నాసిరకమైన విద్యని అందిస్తూ లక్షల్లో ఫీజులను విపరీతంగా దండుకుంటున్నారన్నారు. మరోపక్క విద్యా సంవత్సరం ముగించక ముందే పాఠశాలు చట్ట విరుద్ధంగా కరపత్రాలు,బ్యానర్లు,యాడ్స్ తో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతి ప్రైవేట్,కార్పొరేట్ పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ లు నియమించాలన్నారు. ముందస్తు అడ్మిషన్లకు పాల్పడుతున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్. అనిల్ కుమార్, జిల్లా కోశాధికారి నిఖిల్ , జిల్లా నాయకులు వినోద్,నగేష్, నసీర్,సంతోష్,సునీల్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article