కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
పీడీఎస్ యూ నాయకుల డిమాండ్ నిజామాబాద్, బతుకమ్మ : నిబంధనలు విరుద్ధంగా అడ్మిషన్లు చేస్తూ అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రైవేటు,కార్పొరేట్ పాఠశాలలకు చర్యలు తీసుకోవాలని పీడీఎస్ యూ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నగరంలోని గూపన్పల్లి శ్రీ చైతన్య పాఠశాల ఎదుట నిరసన, అడ్మిషన్ కరపత్రాల దహనం చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి ఆశోక్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా పీడీఎస్ యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. నరేందర్, కర్క గణేష్ లు మాట్లాడుతూ...