బతుకమ్మ,మోర్తాడ్: మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బ గోని అశోక్ గౌడ్ నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రచారంలో భాగంగా ప్రైవేట్ టీచర్లను, ప్రైవేటు సంస్థలు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను కలసి కార్పొరేట్ పాలిటిక్స్ కి స్వస్తి చెప్పాలని పట్టభద్రులకు విజ్ఞప్తి అబ్బ గోని అశోక్ గౌడ్ అన్నారు. బిజెపి పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బి ఎస్ పి పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ..వీరు కేవలం వారి స్వలాభం కోసమే పట్టబద్రులు ఆకర్షించుకోవడం కోసమే రాజకీయాల్లోకి రావడం జరిగిందని విమర్శించారు. డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయాలలోకీ వచ్చేవాళ్లు వాళ్ల భవిష్యత్తును చూసుకుంటారు తప్ప .. ఓటు వేసిన వాళ్ల భవిష్యత్తు ఆ గమ్య గోచరంగా మారుతుందని గ్రహించాలని ఆయన తెలియజేశారు. తదుపరి ఐదు సంవత్సరాలు నిరాశగా మిగులుతారని పేర్కొన్నారు. అంజిరెడ్డి, నరేందర్ రెడ్డి, ప్రసన్న హరికృష్ణ వీరు గెలిచినట్లైతే నిరుద్యోగులకు న్యాయం జరగదని….వీరు ఎన్నడూ కూడా బడుగు బలహీన వర్గాల కోసం ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదని అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్,మహాత్మ జ్యోతిబాపూలే ,సావిత్రిబాయి, పేర్లను ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఓటు వేసే పట్టభద్రులు ఆలోచించాలని తమకు వెన్నంటే ఉండి వాళ్ళ పక్షాన నిలబడే వ్యక్తికి ఓటేయాలని తెలియజేశారు. బీసీ వాదంతో పేరు చెప్పుకొని ఎమ్మెల్సీ బరిలో ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ ఎన్నడూ కూడా బీసీల ఉద్యమంలో ఎక్కడ కూడా పాల్గొన్నట్లు లేదని , ఈ రోజు బీసీ ముసుగులో నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని తెలియపరచారు. పట్ట బద్రులు పొట్ట కూటి కోసం చాలీచాలని జీతంతో వెట్టి చేస్తున్నారని, చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎమ్మెల్సీగా గెలిపించి శాసనమండలికి నిరుద్యోగుల పక్షాన నిలబడతానని తెలియజేశారు. కార్యక్రమంలో తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరినిడ దశరథ్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు బెజ్జరం అంబదాస్, తెలంగాణ బిసి గ్రాడ్యుయేట్స్ ఫోరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లోల్ల సురేష్, తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం నాయకులు రాజుల కృష్ణ, బాల్ రాజ్, డి కృష్ణ,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

