- నరాలు తెగి మంచానికే పరిమితమైన విద్యార్థిని
రంగారెడ్డి, బతుకమ్మ : టీచర్లు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని అవమానంతో స్కూల్ బిల్డింగ్ పైనుండి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మహాత్మ జ్యోతి బాఫులే బాలికల హాస్టల్లో చోటుచేసుకుంది. అక్కడ చదువుతున్న లావణ్య అనే విద్యార్ధిని తనను టీచర్లు అవమానిస్తున్నారని, నీకు చదువు రాదు.. నువ్వు వెళ్ళిపోతే వేరే వాళ్ళు చదువుతారని అంటున్నారని, తనతో టిఫిన్ బాక్సులు, బ్యాగులు మోయిస్తున్నారని అవమానించడంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు విద్యార్థిని తెలిపింది. నరాలు తెగిపోయాయి.. ఇకమీద నువ్వు నడవలేవు.. మంచం మీద నుండి లేవలేవు.. అని డాక్టర్లు అంటున్నారని ఆ చిన్నారి రోదిస్తూ తెలిపింది.
