31 C
Hyderabad

కూతురి వివాహంలో తండ్రికి గుండెపాటు

Must read

📰 Generate e-Paper Clip

  • ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి
  • రామేశ్వర్ పల్లిలో విషాదం

 

బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన కుడిక్యాల బాల్ చంద్రం పెళ్లి పందిట్లో గుండెపోటుతో మృతి చెందాడు. తన కూతురు వివాహం గురువారం బిటిఎస్ చౌరస్తా సమీపంలో ఉన్న ఇంద్రప్రస్థ గార్డెన్ లో జరిగింది. వేద బ్రాహ్మణోత్తముల  మధ్య వివాహం జరుగుతుండగా ఒక్కసారిగా తండ్రి బాలచంద్రం అనారోగ్యానికి గురయ్యాడు.దింతో అతడిని హుటాహుటిన ఆసుప్రత్రికి తరలించగా ఆ తరువాత జరగాల్సిన తంతును వారి కుటుంబ సభ్యులు పూర్తి చేశారు. అయితే అనారోగ్యానికి గురైన  తండ్రిని వాహనంలో కామారెడ్డి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో తండ్రి మృతి చెందాడు. కూతురు పెళ్లి చూడకముందే, తండ్రి మరణ వార్త తెలియడంతో, పెళ్లికి హాజరైన వారంతా ఒక్కసారిగా భయపడిపోయారు. ఎంతో ఆడంబరంగా పెళ్లి చేసినప్పటికీ, ఆ పెళ్లి చూడకముందే తండ్రి మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని  మిగిల్చింది.

More articles

Latest article