23.3 C
Hyderabad
Sunday, August 2, 2026

తుఫాన్, మోటార్ సైకిల్ ఢీ

Must read

📰 Generate e-Paper Clip

  • మల్లారం గండిలో ఘటన
  • బైక్ పైన ఉన్న యువకుడికి తీవ్రగాయాలు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం గండిలో శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనం, మోటార్ సైకిల్ ను టక్కరిచ్చింది. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న యువకుడుకి తీవ్రగాయాలు అయ్యాయి. నిజామాబాద్ నుంచి వర్నివెలుతున్న బైక్ ను బాన్సువాడ నుంచి నిజామాబాద్ వస్తున్న తుఫాన్ వేహికిల్ ఢీకోట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న యువకుడికి తీవ్రగాయాలు కాగా, తుఫాన్ వాహనంలో ఉన్నవారికి స్వల్ప గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని అంబులేన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Typhoon, motorcycle collision

More articles

Latest article