27.5 C
Hyderabad
Friday, July 31, 2026

శ్రీలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలోని 18 వ వార్డు శ్రీనివాస్ నగర్ లో  బుధవారం  శ్రీలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 22వ వార్షిక కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సాయి ప్రసాద్ శర్మ, యాగ్నిక బ్రహ్మ శ్రీమాన్ ఆ సూరి వెంకటాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో మూడు రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. అందులో భాగంగా బుధవారం ఆలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారి కల్యాణాన్ని వేద పండితుల మంత్రోచ్ఛరణతో, మేళా తాళాల మధ్య జయలక్ష్మి శ్రీనివాసరాజు, నీరజ నాగరాజు దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారని పేర్కొన్నారు.  భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తుల కొరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏసిపి శ్రీనివాస్, పట్టణ సీఐ వెంకటనారాయణ, శివరాం, ప్రసాద్, వాసు, వెంకటరమణ, సతీష్, నాని,  శ్రీనివాస నగర్ గ్రామ పెద్దలు ప్రముఖులు యువత మహిళలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Brahmotsavam of Sri Venkateswara Swamy along with Sri Lakshmi Goda

More articles

Latest article