శ్రీలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
బోధన్, బతుకమ్మ : బోధన్ పట్టణంలోని 18 వ వార్డు శ్రీనివాస్ నగర్ లో బుధవారం శ్రీలక్ష్మి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 22వ వార్షిక కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సాయి ప్రసాద్ శర్మ, యాగ్నిక బ్రహ్మ శ్రీమాన్ ఆ సూరి వెంకటాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో మూడు రోజులపాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. అందులో భాగంగా బుధవారం ఆలయంలో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు...