27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఘనంగా శివాజీ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

యువత శివాజీ అడుగుజాడల్లో నడవాలి

బోధన్,బతుకమ్మ : పట్టణంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో శివాజీ మహరాజ్ 395వ జయంతిని శివాజీ విగ్రహ వ్యవస్థాపకులు పసుపులేటి గోపి కిషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మశారత్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, ఏఎంసీ చైర్మన్ అంకుసంధ్యా దామోదర్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి, బీ ఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రవీందర్ యాదవ్, డాక్టర్ సుధాకర్, ఏక చక్ర సేవా సమితి అధ్యక్షులు అంకు మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం శివాజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మిఠాయిలు పంపిణీ చేశారు. . ఈ సందర్భంగా మాజీ కౌన్సిల్ సభ్యులు శరత్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి, పసుపులేటి గోపి కిషన్ మాట్లాడుతూ హైందవ స్వరాజ్య స్థాపనకు, దేశం, ధర్మం కోసం శివాజీ చేసిన కృషిని కొనియడారు. యువత శివాజీ అడుగుజాడల్లో నడవాలన్నారు. ఈసందర్భంగా శివాజీ విగ్రహ ఏర్పాటుకు కృషి చేసినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో కౌన్సిల్ సభ్యులు శ్రీకాంత్ గౌడ్, అంకు దామోదర్ రెడ్డి, పిట్ల సత్యం, గంగాధర్ గౌడ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు గౌతమ్, లోకేష్, కస్ప లింగం, వీడీసీ కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article