25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

జిల్లా అభివృద్ధికి షబ్బీర్ అలీ నిరంతరం కృషి

Must read

📰 Generate e-Paper Clip

  • కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెయూ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పంచ రెడ్డి చరణ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ శాఖల  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు పంచ రెడ్డి చరణ్ ఆధ్వర్యంలో  తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిపాలన భవనంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచ రెడ్డి చరణ్ మాట్లాడుతూ షబ్బీర్ అలీ ఎన్ ఎస్ యు ఐ నుండి కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఎదిగిన ప్రస్థానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. ముఖ్యంగా నేటి యువతరానికి ఆయన నాయకత్వం పాఠాలు స్ఫూర్తి అని అన్నారు.  ఆయన 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి  తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై, 31 ఏళ్లకే చెన్నారెడ్డి మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, మత్స్యశాఖ ఇన్‌చార్జ్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని తెలిపారు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మంత్రి వర్గంలో విద్యుత్‌, బొగ్గు, మైనారిటీ సంక్షేమం, వక్ఫ్‌, ఉర్దూ అకాడమీ శాఖల మంత్రిగా పని పనిచేసి ఆయా శాఖల అభివృద్ధి పై చెరగని ముద్ర వేశారని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి నిజామాబాద్ ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా అభివృద్ధి కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడని, శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా అప్పటి ప్రభుత్వం వైఫల్యా లను ఎండగట్టి ప్రతిపక్ష నాయకునిగా సమర్థవంతంగా సేవలందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సాయ గౌడ్, భాస్కర్, హరీష్, హరినాథ్, భాను,సాయితదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article