29 C
Hyderabad
Monday, August 3, 2026

బాల్య మిత్రుడి కుటుంబానికి భరోసా

Must read

📰 Generate e-Paper Clip

. రూ.4 లక్షల ఆర్థిక సాయం..

. వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసి ముందుకు..

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తమతో కలిసి చదువుకుని అనారోగ్యంతో మృతి చెందిన మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచి తమ ఔదర్యాన్ని చాటుకున్నారు మాణిక్ భవన్ పాఠశాల 2003 – 04 బ్యాచ్ విద్యార్థులు. నిజామాబాద్ నగరానికి చెందిన నరేశ్ (35) ఖలీల్ వాడీలోని ఓ బ్లడ్ బ్యాంక్ లో పని చేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్నేహితులు (2003 – 04 ఎస్సెస్సీబ్యాచ్) నరేశ్ కుటుంబానికి అండగా నిలిచారు. ‘మానిక్ భవన్ ఎంఎంఐవీ 2004 బ్యాచ్ వెల్ఫేర్ సొసైటీ’ ఏర్పాటు చేసి రూ.4లక్షలు పోగేశారు. ఆ మొత్తాన్ని తమ స్నేహితుడైన నరేశ్ భార్యాపిల్లలకు అందజేశారు. భవిష్యత్  లో నరేశ్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తమతో కలిసి చదువుకున్న స్నేహితుల్లో ఎవరికి ఏ ఆపద వచ్చినా సొసైటీ ద్వారా అండగా నిలుస్తామని పేర్కొన్నారు. వీరి  సేవలకు పలువురు అభినందనలు తెలిపారు.

More articles

Latest article