26.6 C
Hyderabad
Monday, August 3, 2026

జాన్కంపేటలో రూ.15 లక్షల విలువైన సొత్తు చోరీ

Must read

📰 Generate e-Paper Clip

ఘటన స్థలాన్ని పరిశీలించిన బోధన్ ఏసీపీ

నిజామాబాద్, బతుకమ్మ: ఎడపల్లి మండలంలోని జాన్కంపేటలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. జాన్కంపేటకు చెందిన నీల భాస్కర్   తన అన్న కొడుకు వివాహం ఉండటంతో శుక్రవారం ఇంటికి తాళం వేసి నిజామాబాద్ కు వెళ్లారు. అర్ధరాత్రి దొంగలు ఇంట్లోకి చొరబడి పడ్డారు 14 తులాల బంగారం, రెండు కిలోల వెండి, మూడు లక్షల ఇరవై వేల నగదును అపహరించారు. ఘటన స్థలాన్ని శనివారం బోధన్ ఏసీపీ పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More articles

Latest article