28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

శ్రీ రంగనాయక స్వామి జాతర

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ మండలంలోని మంథని గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి జాతర ఉత్సవం శుక్రవారం కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి జాతర ఉత్సవాలు 120 సంవత్సరాలు నుంచి జరుగుతున్నట్లు ఆలయాచుకులు తెలిపారు. ప్రతి ఏటా మాఘ పౌర్ణమి లో 3 రోజుల పాటు జాతర రాథోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. 11 రోజులపాటు దీక్ష చేపట్టి నియమనిష్టలతో స్వామివారిని పూజిస్తారని చెప్పారు.  జాతర మహోత్సవాన్ని చూసేందుకు చుట్టుపక్కల జిల్లా నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారని తెలిపారు.  జాతరలో భాగంగా భక్తులకు అన్నప్రాసదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.

More articles

Latest article